calender_icon.png 8 January, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో 12 నెలల పాలన ప్రత్యక్ష నరకమే

01-01-2025 02:00:20 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్  

హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి):తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘ఏం చూసింది ఏడాది కాలం  తెలంగాణ.. 12 నెలల ప్రత్యక్ష నరకం తప్ప’ అంటూ ఆయన మంగళవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. రైతుల రోదనలు, ఆటోవాలాల ఆత్మహత్యలు, ఆడబిడ్డల ఆక్రందనలు, నిరుద్యోగుల నిరాశ, నిస్పృహలు, పసిపిల్లల అన్నంలో పురుగులు, హైడ్రాతో అరాచకాలు, మూసీతో మూటలు నింపే ప్రణాళికలు, కాంట్రాక్టర్ల దోపిడీ కథలు, నీటిమూటలైన మాటలు తప్ప తెలంగాణ ఏం చూడలేదని విమర్శించారు.