calender_icon.png 8 February, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొమ్ము వారిదే..! శోకం వారికే..!!

08-02-2025 12:00:00 AM

  1. రిజిస్ట్రేషన్ స్లాట్ రద్దయినా అందని సొమ్ము 
  2. ధరణి అమలు తరువాత ఏండ్లుగా ఇదే తంతు
  3. జిల్లాలో వేలాదిమంది బాధితులు

సూర్యాపేట, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి) ః భూముల రిజిస్టేషన్ కోసం ధరణిలో స్లాట్ బుక్ చేసుకొని అనివార్య కారణాలతో స్లాట్ రద్దు చేసుకున్న రైతుల సొమ్ము తిరిగి రావడం లేదు. ధరణి నిబంధనల ప్రకారం స్లాట్ బుక్ చేసు కునే సమయంలో మీ సేవా కేంద్రాల్లో చెల్లిస్తున్న సొమ్ములు, స్లాట్ రద్దయిన పక్షంలో తిరిగి చెల్లించాలనే నిబంధన ఉన్న ప్పటికీ అది అమలురు నోచుకోవడం లేదు.

ఈ నేపద్యంలో వేలాది మందికి స్లాట్ రద్దు సొమ్ములు అందని ద్రాక్షగానే అవుతున్నాయి. అయితే తాజాగా కాంగ్రేస్ ప్రభుత్వం ధరణి ని మార్చుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వమైనా తమ సొమ్మును తిరిగి చెల్లిస్తారని రైతులు ఎదురుచూస్తున్నారు. 

జిల్లాలో వేలాదిమంది...

భూముల క్రయ విక్రయాలు పారదర్శకంగా ఉండాలని గత ప్రభుత్వం ధరణి పోర్టల్ను 2020లో అందుబాటులోకి తీసుకుని వచ్చింది. భూ రిజిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన రుసుములు చెల్లించి స్లాట్ను బుక్ చేసుకుంటున్నారు.

అని వార్య కారణాల వల్ల స్లాట్ను రద్దు చేసుకున్నా, ఇతర కారణాలతో స్లాట్ రద్దు అయినా మీ సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి చెల్లించిన సొమ్ములు తిరిగి రైతుల ఖాతాలో జమ కావడం లేదు. జిల్లా వాప్తంగా 23 మండలాల పరిధిలో స్లాట్ బుక్ చేసుకున్న తరువాత రద్దయిన రిజిస్ట్రేషన్ కారణంగా, వాపస్ రావాల్సిన సొమ్ము కోసం సుమారు 3 వేల మంది ఎదురు చూస్తున్నారు.

ఎవరిని అడగాలో తెలియక..

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం మీ సేవలో ఆయా ప్రాంతాల్లో భూమి విలువ ఆధారంగా నిబంధనల ప్రకారం రుసుము చెల్లించి ఒప్పందం ప్రకారం స్లాట్ బుకింగ్ చేసుకుంటారు. స్టాట్ కేటాయించిన రోజున సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో ఇరు వర్గాల సమక్షంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తారు. వివిధ కారణాలతో  కొంత మంది రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకుంటున్నారు.

కొన్నింటిని అధికారులే అనుమతించ డం లేదు. వారికి ధరణి నిబంధల ప్రకారం రిజిస్టేషన్ కోసం మీ సేవాలో స్లాట్ బుకింగ్ సమయంలో చెల్లించిన సొమ్ములను తిరిగి రైతు ఖాతాలో జమ చేయాల్సి ఉంది. అలా జరగక పోవడంతో వాటి కోసం రైతులు తహసీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.

ధరణిలో భూవిక్రయాలు నిలిచిపోయిన క్రమంలో చెల్లింపులకు సంబంధించిన వివరాలను గురించి ఎవదీని అడగాలో తెలియక స్లాబ్ బుక్ చేసుకున్న వారు తికమకపడుతున్నారు. ఎకరం భూమి రిజిస్టేషన్కు  సెల్ డీడ్కు 4 శాతం, గిప్ట్ డిడికి 3శాతం రుసుము చలానా రూపంలో ప్రభుత్వ ఖాజానాకు జమ చేస్తున్నారు.

అయితే చివరి క్షణలలో వారసత్వ భూముల విషయంలో సమస్యలు తలెత్తడం, మిస్సింగ్ సర్వే నంబర్లు ఉండటం, ఆన్లున్లో సర్వే నంబర్లు కనిపించకపో వడం, భూమి విక్రయంపై అభ్యంతరాలు వ్యక్తం కావడం, వ్యక్తిగత కారణాలతో చివరి క్షణంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపో తున్న సందర్భాలున్నాయి. కాగా  మూడేళ్లుగా స్లాట్ రద్దయినా వారికి సొమ్ములు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.