నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నోడల్ అధికారులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 16, 8 0 9 మంది పట్టపద్రులు, 19 44 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని తెలిపారు. జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈనెల 10 నుంచి నామినేషన్ల ప్రక్రియ నిర్వహించి 26న ఎన్నిక ఉంటుందని తెలిపారు. ఎన్నికల నియామాలని ప్రతి ఒక్కరు పాటించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఆర్ఓ రత్న కళ్యాణి జిల్లా అధికారులు పాల్గొన్నారు.