calender_icon.png 18 April, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్ఓసి అందచేసిన ఎమ్మెల్యే

09-04-2025 11:00:49 PM

పటాన్ చెరు: ఆపత్కాలంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన హంసమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన రూ.4 లక్షల విలువైన ఎల్ఓసి ని ఆమె కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందచేశారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.