22-02-2025 12:00:00 AM
మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్, ఫిబ్రవరి 21 (విజయ క్రాంతి) ః నిర్మల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన అమృత్ టు పథకం పనులను పర్సంటేజ్ ల కోసం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నిర్మల్ మున్సిపాలిటీలో 62 కోట్లతో మంజూరైన అమృత 2 పథకంలో భాగంగా వృధాగా పడి ఉన్న పైపులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మురళీధర్ రెడ్డి గంగాధర్ ధర్మాజీ శ్రీనివాస్ ధర్మాజీ రాజేందర్ వినోద్ కుమార్ శ్రీకాంత్ కృష్ణ ప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు.