కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్‌మోహన్‌రావును కలిసేందుకు గాంధారి మండలం మేడిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్భర్ ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు వస్తుండగా మార్గమధ్యలో ప్రమాదం జరిగింది. గాయపడిన అక్భర్‌ను స్థానికులు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ గ్రామ కమిటి అధ్యక్షుడు అక్భర్‌ను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్‌మోహన్‌రావు విషయాన్ని తెలుసుకొని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. క్షతగాత్రునికి మనోధైర్యాన్ని చెప్పిన ఎమ్మెల్యే వైద్యులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ, సాయిబాబా, వెంకట్‌రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.