calender_icon.png 13 January, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీల్లో టెండర్ల రద్దుపై ఎమ్మెల్యే స్పందించాలి

13-01-2025 05:02:00 PM

బీఎస్పీ ఆధ్వర్యంలో సీడీఎంఎ, కలెక్టర్ లకు ఫిర్యాదు

బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో టెండర్ల రద్దుపై ఎమ్మెల్యే స్పందించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యాక టెక్నికల్ ప్రాబ్లం అంటూ టెండర్లను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు? టెండర్ల రద్దు వెనక ఉన్న షాడో ఎవరో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని ఈ నియోజకవర్గానికి వచ్చిన ఇద్దరు నియంతలు ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలపై పెత్తనం చెలాయిస్తామంటే గతంలో ఈ విధంగా వ్యవహరించిన వారికి ప్రజలు ఏవిధంగా గుణపాఠం చెప్పారో భవిష్యత్తులో మీకూ అదేవిధంగా ప్రజాక్షేత్రంలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు.

టెండర్ల రద్దుపై ఈనెల 6వ తేదీన గ్రీవెన్స్ లో, ఈనెల 8వ తేదిన హైదరాబాద్ లోని సీడీఎంఏ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఉన్నత అధికారులు వెంటనే స్పందించి టెండర్లు నిర్వహించిన పనులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్, పోలె కనకరాజు, తాటిపాముల హరికృష్ణ, మురళి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.