10-04-2025 05:08:41 PM
15 నెలలైన స్పందించని ఎమ్మెల్యే..
బిజెపి జిల్లా నాయకులు రఘునాథ్..
మంచిర్యాల (విజయక్రాంతి): ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డంపింగ్ యార్డును ఆండాలమ్మ కాలనీ నుంచి తరలిస్తానని హామీ ఇచ్చిన ప్రేమ్ సాగర్ రావు, గెలిచి 15 నెలలైనా పట్టించుకోవడంలేదని బిజెపి సీనియర్ నాయకులు రఘునాథ్ వెరబెల్లి విమర్శించారు. బీజేపీ స్థాపన దివస్ సందర్భంగా మంచిర్యాల పట్టణం అండాలమ్మ కాలనీలో గురువారం పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్తీ ఛలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.
ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డు వలన ఎన్నో ఏండ్ల నుండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకోకపోవడంతో స్థానిక ప్రజలు, చిన్న పిల్లలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో డంపింగ్ యార్డు తరలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా ఇప్పటికీ ఈ సమస్యపై ఎలాంటి స్పందన లేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, నాయకులు మాదవరపు వెంకట రమణ రావు, పచ్చ వెంకటేశ్వర్లు, స్వప్న రాణి, బియ్యాల సతీష్ రావు, మెట్టుపల్లి జయ రామ రావు, వెముల దుర్గా ప్రసాద్, బూర్ల చిరంజీవి, తూటి సరస్వతి, నాగుల రాజన్న, ఎల్కపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు.