calender_icon.png 16 January, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే

16-01-2025 06:42:54 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కట్టం వారి గూడెం గ్రామంలో కట్టంవారిగూడెం యూత్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateshwarlu) బహుమతులను ప్రధానం చేశారు. ప్రధమ బహుమతి గెలుపొందిన కట్టం వారి గూడెం టీమ్ కు రూ.18వేలు, రన్నర్ గా నిలిచిన మిట్టగూడెం యూత్ టీమ్ కు రూ.12వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఇన్ని రోజులు ఈ క్రికెట్ టోర్నమెంట్ ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించిన కట్టం వారి గుంపు యూత్ సభ్యులను అభినందించారు. ఫైనల్లో గెలుపొందిన, రన్నర్ గా నిలిచిన టీం సభ్యులను అభినందించారు. క్రీడలో గెలుపు ఓటములను స్నేహభావంతో తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారులకు అండగా ఉంటుందని గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు మీ ప్రతిభను చూపించాలని క్రీడాకారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య, అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.