నారాయణఖేడ్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో మధ్య తరహా ప్రాజెక్టు అయిన నల్లవాగు ప్రాజెక్టులో శనివారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, టీజిఎఫ్సిఓఎఫ్ (తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య లిమిటెఢ్) చైర్మన్ సాయికుమార్ తో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. చేప పిల్లల్ని ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు చేపలు పట్టే ముదిరాజ్ కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.