calender_icon.png 24 November, 2024 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి అభివృద్ధికి ఎమ్మెల్యేనే అడ్డు

24-11-2024 12:32:13 AM

డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు ఆరోపణ

కామారెడ్డి, నవంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి అభివృద్ధికి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి అడ్డుపడుతున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు ఆరోపించారు. శనివారం కామారెడ్డిలోని పార్టీ కార్యాల యంలో మీడిమా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే బెదిరించడంతో అధికారులు సెలవుల్లో వెళ్తున్నారని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో సొంత మ్యానిఫెస్టోలో ఇచ్చిన 150 కోట్ల హమీ ఏమైందని పశ్నించారు. కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తానని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వసతులు ఉన్న కామారెడ్డి నియోజకవర్గానికి రావాల్సిన ఇంటిగ్రేటేడ్, రెసిడెన్షియల్ స్కూల్ జుక్కల్ నియోజకవర్గానికి తరలిపోయిందన్నారు.

రాష్ట్రంలో 13 నర్సింగ్ కళాశాలలు మంజూరు కాగా ఎమ్మెల్యే వైఖరి వల్ల కామారెడ్డికి నర్సింగ్ కళాశాల రాలేదన్నారు. ఎమ్మెల్యే వైఖరికి విసుగు చెందిన అధికారులు ఇతర ప్రాంతాలకు బది లీ చేయించుకుంటున్నారని ఆరో పించారు. కొత్త అధికారులు రావడానికి జంకుతున్నారని తెలిపారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల 26 ఎకరాల భూములను అరోరా కాలేజీకి అప్పన్నంగా అప్పగించాడని ఆరోపించారు.

ఎమ్మెల్యేకు దమ్ముంటే కళాశాల భూములపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, భిక్కనూర్ మండల అధ్యక్షుడు భీంరెడ్డి, నాయకులు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, కారంగుల అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.