calender_icon.png 23 December, 2024 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిఖనిలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

13-10-2024 12:37:02 PM

రామగుండం (విజయక్రాంతి): గోదావరిఖని 6వ డివిజన్ లో గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందుబాటులో సమాచారం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ 6 గ్యారంటీలలో మహిళలకు బస్సు ఫ్రీ అని, రూ. 500 రూపాయలకే గ్యాస్, రైతులు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు అనేక సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.