calender_icon.png 18 January, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గానికి ఎమ్మెల్యే కొత్తగా చేసింది ఏమీ లేదు

17-01-2025 05:11:28 PM

మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య... 

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) కొత్తగా చేసింది ఏమీ లేదని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. శుక్రవారం నెన్నెల మండల కేంద్రంలో విలేఖర్ల తో మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్(CM Revanth Reddy) సర్కారు ఏర్పడ్డ సంవత్సర కాలంగా ఎక్కడ అభివృద్ధి జరగలేదన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ అందుబాటులో ఉండకపోవడం వల్ల మండలానికో నాయకుడు ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారని ఆరోపించారు. నెన్నెల మండలంలో కాంగ్రెస్ నాయకుడు హరీష్ గౌడ్ రైస్ మిల్ పెట్టుకుని వడ్ల కొనుగోలులో రూ.2 కోట్ల 90 లక్షల అవినీతికి పాల్పడ్డాడని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులుగా చలామణి అవుతున్న రైస్ మిల్లర్లు రూ.100 కోట్ల పైనే అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అవినీతి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), కలెక్టర్, సివిల్ సప్లై అధికారుల కళ్ళకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

వెంటనే అక్రమార్కులపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ రోడ్లపై అభివృద్ధి పనులు తానే చేసినట్లు గొప్పగా ఫ్లెక్సీలు పెట్టుకొని ప్రచారం చేస్తున్నారే తప్ప నియోజకవర్గ అభివృద్ధిలో పాటుపడింది లేదని ప్రజలు గుర్తించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్(KCR) నియోజకవర్గానికి 30 కోట్ల నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. నెన్నల, కొత్తపల్లికి రూ.3 కోట్ల 54 లక్షలు, బొప్పారం రోడ్డుకు రూ. 80 లక్షలు, కొత్తగూడెం రోడ్డుకు రూ. కోటి నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేయగా ఆ నిధులను తామే మంజూరు చేయించామని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని నెరవేర్చకుండా అబద్దాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అబద్ధపు హామీలతో రాష్ట్ర రైతాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిండా ముంచారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ మేకల మల్లేష్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సింగతి రామచందర్, మాజీ ఎంపిటిసి పురం శెట్టి తిరుపతి, రమేష్, మాజీ సర్పంచ్ సాగర్ గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.