calender_icon.png 25 November, 2024 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయలని సీఎంను కోరిన ఎమ్మెల్యే

24-11-2024 10:30:01 PM

సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేత 

భద్రాద్రికొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలతో పాటు, ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఫోర్త్ ఎస్టేటుగా, ప్రభుత్వానికి, ప్రజలకు వారిదిగా పనిచేస్తూ చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న జర్నలిస్టులకు నిలువనీడలేని పరిస్థితులు నెలకొన్నాయని, వీరికి గూడు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సాధ్యమైనంత త్వరలో ఇండ్ల స్థలాలు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరానని, తన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలో చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు.