calender_icon.png 30 April, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధరణితో రైతులకు సమస్యలు పెరిగాయి: మంత్రి పొంగులేటి

29-04-2025 05:42:43 PM

భూభారతితో అర్హులైన పేదవారికి భూమి అందుతుంది...

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ధరణితో భూ సమస్యలు పెరిగాయే తప్ప రైతుల సమస్యలు తీరలేదని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఆయన మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం శెట్పల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

కామారెడ్డి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసిన లింగంపేట మండలం శెట్టిపల్లి గ్రామంలో ప్రజలకు భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... షట్పల్లి గ్రామంలో భూ సమస్యలపై ఇప్పటికే నాలుగు వందల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇంకా రెండు గ్రామాలలో రెవెన్యూ అధికారులు దరఖాస్తు స్వీకరిస్తున్నారని రెండు రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ పూర్తి అవుతుందని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ధరణి వల్ల ప్రజలకు ఎంతో అన్యాయం జరిగిందని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన పేద రైతులకు ప్రజలకు సమస్యల పరిష్కారానికి ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను ఇప్పటికే పరిష్కరించామని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భూభారతి కార్యక్రమాన్ని చేపట్టారని భూభారతి పథకం ద్వారా  ప్రజలకు జరిగిన అన్యాయాలను ధరణిలో వచ్చిన ఇబ్బందులను సాదా బైనామా, పేర్లు తప్పులు తో పాటు పలు సమస్యలను భూభారతి ద్వారా పరిష్కారం జరుగుతుందని అన్నారు. భూభారతి కార్యక్రమం ఎమ్మార్వో స్థాయి నుండి ఆర్డీవో, జిల్లా కలెక్టర్ సిసిఎల్ఐ ఆపై రెండు టీములు పనిచేస్తాయని తెలిపారు. ఎవరైనా తప్పులు చేసినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. భూభారతి 2025 చట్టం ద్వారా పేద ప్రజలకు న్యాయం చేయకురుతుందని  భూభారతి కార్యక్రమంలో అర్హులైన నిరుపేద ప్రజలకు తప్పనిసరిగా ప్రభుత్వ భూమి, భూమిలో గాని ఎటువంటి సమస్యలు ఉన్న తప్పకుండా జిల్లా కలెక్టర్ స్థాయిలో సమస్యలు తొలగించవచ్చునని అన్నారు.

గతంలో మాదిరిగానే గ్రామస్థాయిలో మళ్లీ రెవెన్యూ వ్యవస్థ వస్తుందని త్వరలోనే గ్రామ రెవెన్యూ అధికారులు 10956 మంది రెవెన్యూ అధికారులు,కొలువు తీర పోతున్నారని అన్నారు. అలాగే ప్రజలకు భూముల పట్ల తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని 6000 మందికి సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి లైసెన్సుల అందజేసి ప్రతి భూమికి సర్వే చేయడానికి సర్వేలను పంపుతున్నామని అన్నారు. లింగంపేట్ మండలంలో ప్రభుత్వ స్థలాలు ప్రైవేట్ స్థలాల్లో పలు భూముల్లో సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ లింగంపేట్ మండలంలో ప్రత్యేక అధికారి ఒక అడిషనల్ కలెక్టర్ సాయి అధికారిని నియమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జూన్ 2 నాటికి ఇందిరమ్మ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఈ మండలంలో ఉన్న భూ సమస్యలన్నీ తొలిగేవిధంగా విధంగా అధికారులు చర్యలు చేపడతారని అన్నారు. ఆగస్టు 2 భూభారతిలో సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులు పనిచేస్తారని తెలిపారు.

అనంతరం తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పుల కుప్ప నుంచి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సంక్షేమ పథకాలు సమృద్ధిగా అందిస్తున్నారని ప్రభుత్వం అప్పుల్లో ఉన్న ప్రజలకు మాత్రం ఇచ్చిన మాటను తప్పకుండా ముందుకు అడుగులు వేస్తున్నారని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్(MLA Madan Mohan) మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో గత పాలన పూర్తిగా దరిద్రంగా ఉండేదని ఇందిరమ్మ రాజ్యం రావడంతో ఇందిరమ్మ పాలనలో ప్రజా పాలన ప్రశాంతంగా కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదలకు 6 గ్యారంటీలను అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి, ప్రజా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు.

అర్హులైన వారికి విడతల వారీగా వచ్చేనెల 5వ తారీఖు నుంచి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. 2025 సంవత్సరంలో 20 లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు నిర్మింపచేస్తామని అన్నారు. గతంలో ప్రభుత్వ భూమిని సాగు చేసుకున్న రైతులకు అధికారులు పర్యవేక్షణ చేసి తప్పకుండా అనుమతి పత్రాలు అందిస్తారని అన్నారు. పేదింటికి భరోసా పేదోడికి అండ ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్మోహన్ ఎంపీ సురేష్ శట్కర్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నే ప్రభాకర్ ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్రనారా గౌడ్, మాజీ జెడ్పిటిసి శ్రీలత సంతోష్ రెడ్డి, తహసిల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.