calender_icon.png 19 January, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహోన్నత శక్తి ఎన్టీఆర్

19-01-2025 12:00:00 AM

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుమారుడు ప్రీతమ్ రెడ్డి 

ఎల్బీనగర్, జనవరి 18 : తెలుగువారి ఖ్యాతిని ఖండాతరాలకు చాటి చెప్పిన మహోన్నత శక్తి ఎన్టీఆర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుమారుడు ప్రీతమ్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ 28వ వర్దంతి సందర్భంగా శనివారం వనస్థలిపురం పనామా వద్ద ఉన్న  విగ్రహానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కుమారుడు ప్రీతమ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  బీఆర్‌ఎస్ హయాంలోనే పనామా చౌరస్తాను ఎన్టీఆర్ చౌరస్తాగా పేరు మార్చారని గుర్తు చేశారు. 

లింగోజిగూడ డివిజన్ సాయినగర్ కాలనీలో మాజీ కౌన్సిలర్ చిత్తలూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో  ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు.  ఎమ్మెల్యే కుమారుడు దేవిరెడ్డి ప్రీతమ్ రెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు శ్రీధర్, రాకేశ్, శేఖర్, సుధాకర్, ఏడుకొండలు, గంగపుత్ర భాస్కర్, మధుసాగర్, ఇంద్రజి, పార్వతి, లక్ష్మీదుర్గ, నరేశ్, శ్రీనివాస్, ఆనంద్, శోభారాణి, దేవి, సుజిత్, రుద్రాల శ్రీనివాస్, బొంబాయి, అశోక్, సరళ, అనూష తదితరులు హాజరయ్యారు.