calender_icon.png 5 January, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమానంలో మధ్య సీటే సురక్షితం

31-12-2024 02:58:35 AM

* విమానయాన రంగ నిపుణులు డౌగ్ డ్రూరీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ఈ మధ్య తరుచూ విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణికులు ఎక్కడ కూర్చోవడం సురక్షితమన్న చర్చ మొదలైంది. అత్యధికులు విండో సీట్లో కూర్చుండేందుకు ఆసక్తి చూపుతారు. ఈ టైమ్‌లో భద్రత గురించి పెద్దగా పట్టించుకోరు.

విమానంలో ఏ సీట్లో కూర్చోవడం సురక్షితమనే విషయంలో నిపుణుల అభిప్రాయం అడగగా మధ్య సీటులో కూర్చోవడం సురక్షితమని చెబుతున్నారు. ఆస్ట్రేలియా సెంట్రల్ క్వీన్‌లాండ్ యూనివర్సిటీకి చెందిన విమానరంగ నిపుణుడు ప్రొఫెసర్ డౌగ్ డ్రూరీ సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

విమాన ప్రమాదాలు జరిగినప్పుడు విండో సీటు, సీటింగ్ వరుస ప్రారం భంలో ఉండే సీటుతో పోలిస్తే మధ్యలో ఉండే సీటు సురక్షితమైందని చెప్పారు. ఇందుకు కారణాలనూ ఆయన వివరించారు. ప్రమాదం జరిగిన ప్పుడు విండో సీటుపై బయటి నుంచి, చివరి సీటుపై విమానం లోపలి నుంచి ప్రభావం పడుతుందని చెప్పారు.

ఎమర్జెన్సీ డోర్‌కు దగ్గరగా ఉన్న సీటు కూడా సురక్షితమేనని ఆయన స్పష్టం చేశారు. అలాగని మధ్యలో ఉన్న సీట్లన్నీ సేఫ్ అని చెప్పలేమని, విమాన రెక్కల్లో ఇంధనం ఉన్న నేపథ్యంలో ఆ వరుసలో ఉండే మధ్య సీట్లపై ముందుగా ప్రభావం పడుతుందని వివరించారు. ముందు వరుస మధ్య సీట్లతో పోలిస్తే వెనుక వరుస మధ్య సీట్లు సురక్షితమని డ్రూరీ తెలిపారు.