calender_icon.png 30 October, 2024 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యతరగతి ‘తల్లి మనసు’

10-08-2024 12:05:00 AM

సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మిస్తున్న చిత్రం ‘తల్లి మనసు’. వీ శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారం భమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నిర్మాత పోకూరి బాబురావు క్లాప్‌నివ్వగా, ఏషియన్ గ్రూప్ ఎండీ భర త్ నారంగ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హాస్య నటుడు బ్రహ్మానందం, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ.. “మా అబ్బాయి అభిరుచే ఈ ‘ముత్యాల మూవీ మేకర్స్’ బ్యానర్ స్థాపనకు కారణం.

మూవీ టైటిల్‌ను చూస్తేనే ఇది ఎంత మంచి సబ్జెక్టు అన్నది అర్థమవుతుంది’ అని అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ఓ మధ్యతరగతి తల్లి చుట్టూ తిరిగే చక్కటి కుటుంబ కథా చిత్రమిది. ఆ మె మనోవేదన, సంఘర్షణను ఇందులో ఆవిష్కరి స్తున్నాం’ అని చెప్పారు. నాన్న పేరు నిలబెట్టేలా ఈ సినిమా నిర్మిస్తామని నిర్మాత అనంత కిషోర్ తెలిపారు. రచిత మహాల, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మూల కథ: శరవణన్; కథా విస్తరణ: ముత్యాల సుబ్బయ్య, మరుధూరి రాజా; మాటలు: నివాస్; పాటలు: భువనచంద్ర; సంగీతం: కోటి; డీవోపీ: ఎన్ సుధాకర్‌రెడ్డి.