6 గ్రామాలు కార్పొరేషన్లో విలీనం ఎందుకు...
కరీంనగర్ సిటీ (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన 8 గ్రామాలు నేటికీ అభివృద్ధికి గానీ కనీస సౌకర్యాలు సైతం నోచుకోలేదని, కొత్తగా ఆరు గ్రామాలను కార్పొరేషన్ లో విలీనం చేయడం అన్యాయమని కార్పొరేటర్ కొలగని శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం కార్పొరేషన్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్ మాట్లాడుతూ.. 6 గ్రామాలను కార్పొరేషన్ లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో విలీనమైన గ్రామాల్లో ప్రస్తుత డివిజన్ లో ప్రత్యేక నిధులు కేటాయించి, ఆ ప్రాంతాలు అభివృద్ధి చేసిన తర్వాతే కొత్తగా గ్రామాల విలీనం చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు.