నడిగూడెం (విజయక్రాంతి): మధ్యాహ్న భోజన పథకం మెనూ ఖచ్చితంగా పాటించాలని ఎంఈఓ బి.ఉపేందర్ అన్నారు. మండల పరిధిలోని సిరిపురం ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు వండిన భోజనం సక్రమంగా ఉందా లేదా అని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం భోజనంలో కచ్చితంగా మెనూ పాటించాలని వారికి సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో ఇమామ్ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శి ఆర్.సతీష్ కుమార్, ప్రధానోపాధ్యాయులు ఎన్.ప్రవీణ, డర్రా.ఉపేందర్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.