calender_icon.png 24 December, 2024 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టల్‌లో మెనూ పాటించాలి

24-12-2024 12:48:12 AM

బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయదేవి

నల్లగొండ, డిసెంబర్ 23 (విజయక్రాంతి): బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాల మాయదేవి అన్నారు. నల్లగొండలోని బాలికల, బాలుర కళాశాల హాస్టళ్లను సోమవారం ఆమె పరిశీలించారు. వంట గదులు, భోజనశాల, స్టోరూమ్స్, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. వంట సామగ్రిని వృథా చేయొద్దని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వండాలన్నారు.

మెస్ కమిటీలు, ఆరోగ్య పరీక్షలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠితోపాటు అధికారులతో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై సమీక్షించారు. జాబితాను తప్పులు లేకుండా రూపొం దించాలన్నారు. జనవరి 6 నాటికి తుది జాబి తా ప్రచురించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఆమెవెంట అదనపు కలెక్టర్ శ్రీనివా స్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఆర్వో అమరేందర్, ఆర్డీలు రమణారెడ్డి, అశోక్‌రెడ్డి, వెంకటేశ్వర్లు ఉన్నారు.