calender_icon.png 20 September, 2024 | 2:10 PM

దోపిడీ దొంగల బీభత్సం

20-09-2024 12:45:56 AM

  1. కత్తులతో బెదిరించి రూ.5.10 లక్షల సొత్తు చోరీ
  2. సూర్యాపేట జిల్లా వెల్లటూరులో కలకలం
  3. ఘటనా స్థలిని పరిశీలించిన ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్

సూర్యాపేట/ హుజూర్‌నగర్ 19: సూర్యాపేట జిలా మేళ్లచెర్వు మండలం వెల్లటూ రులో గురువారం తెల్లవారుఝజున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లో చొరబడి రూ.౫.౧౦ లక్షల విలువైన సొత్తు అపహరించారు. మేళ్లచెర్వు ఎస్సై పరమేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకయ్య ఇటుక బట్టీల వ్యాపారం చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. తన ఇంటిలో నిద్రిస్తుండగా గురువారం తెల్లవారుఝామున 3 గంటల సమయంలో ఐదుగురు వ్యక్తులు ముసుగులు ధరించి ఇంట్లోకి ప్రవేశించారు.

వీరు కత్తులతో వెంకయ్యను బెదిరించి బీరువాలో గల ఐదున్నర తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.50 వేల నగదును అపహరించారన్నారు. వీటి విలువ సుమారు రూ.౫.10 లక్షల వరకు ఉంటుందన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ పరిశీలించి, బాధితులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏఎస్పీ నాగేశ్వర్‌రావు, కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, రూరల్ సీఐ రజితారెడ్డి ఉన్నారు.

ఆదిలాబాద్‌లో 12 తులాల బంగారం, అరకిలో వెండి అపహరణ 

ఆదిలాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణంలో భారీ చోరీ వెలుగు చూసింది. పట్టణంలోని పంజేషాకాలనీలో నివాసం ఉంటున్న బొంబడిపల్లి నరేశ్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 14న హైదరాబాద్ వెళ్లారు. అయితే, గురువారం ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం పగిలి ఉండటం గమనించారు. దొంగతనం జరిగిందని గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి వస్తువులని చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉన్న 12 తులాల బంగారం, అరకిలో వెండి ఆభరణాలు, రూ.40 వేల నగదు చోరీకి గురైనట్టు గమనించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు, వేలి ముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు. అక్కడున్న సిసి ఫుటేజ్ లను పోలీ సులు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.