భారత దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్య కారక దేశంగా ఉంది. ఏటా 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తోంది. ఇది ప్రపంచంలోని మిగిలిన దేశాల ప్లాస్టిక్ వ్య ర్థాల్లో ఐదో వంతు. తాజా గణాంకాల ప్రకారం భారత్ ప్లాస్టిక్ వ్య ర్థాల విడుదలలో చైనాను మించిపోయి మొదటి స్థానంలో ఉంది. మైక్రో ప్లాస్టిక్ కాలుష్యం ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌నుంచి వస్తోంది. సేకరించని వ్యర్థాలు, బహిరంగ స్థలాల్లో కాల్చివేత ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. దేశంలో ప్లాస్టిక్ కాలష్యానికి 53 శాతం సేకరించి వ్యర్థాలు, మరో 38 శాతం బహిరంగస్థలాల్లో కాలచడ కారణమని పరిశోధనలు చెబుతున్నాయి.
2030 నాటికి ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి రెండింతలయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి తక్కువగా ఉన్నా సెంట్రల్ పొల్యూషన్ కం ట్రోల్ బోర్డు ప్రకారం ఏటా 4 మిలియన్ టన్నుల వ్యర్థాలను ఉత్ప త్తి చేస్తున్నాం. ఇందులో కొంత భాగమే రీసైక్లింగ్ అవుతుండగా, మిగతాది ల్యాండ్‌ఫిల్స్‌లో డంప్ అవుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తుంది. 2030 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి సమగ్ర వ్యూహం అవసరం.
డా. కృష్ణకుమార్ వేపకొమ్మ, హైదరాబాద్