calender_icon.png 23 December, 2024 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మర్రిచెట్టు కింద మనోళ్లు షురూ

23-12-2024 01:04:46 AM

ప్రమోద్ దేవ, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేందర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘మర్రిచెట్టు కింద మనోళ్లు’. నరేశ్ వర్మ ముద్దం దర్శకత్వంలో శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై రూపొందుతోందీ సినిమా. ఇందులో లిరిషా, ‘బేబీ’ ఫేమ్ ప్రభ, బాబుమోహన్, అన్నపూర్ణమ్మ, కుంతి శ్రీనివాస్, నాగమహేశ్, అప్పాజీ, రఘుబాబు, సునీతా మనోహర్, అశోక్‌కుమార్, ఘర్షణ శ్రీనివాస్, దువ్వాసి మోహన్, రమేశ్ చిన్నా, సమ్మెట గాంధీ, పృథ్వీ తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. సీనియర్ నటుడు బాబుమోహన్ నటీనటులపై క్లాప్ కొట్టారు. రాజీవ్ కనకాల, తెలుగు ఫిలిం చాంబర్ అధ్యక్షడు దామోదర ప్రసాద్, నిర్మాత సీ కల్యాణ్, టీఎంఏఏ ప్రెసిడెంట్ రష్మీ ఠాగుర్ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబుమోహన్ మాట్లాడుతూ.. ‘చాలా మంచి టైటిల్. నేనూ ఇందులో నటిస్తున్నా.

ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నమ్మకం ఉంది’ అన్నారు. హీరోలు ప్రమోద్ దేవ, రణధీర్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో అవకాశం రావడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. హీరోయిన్లు కీర్తన స్వర్గం, ముసాకన్ రాజేందర్ మాట్లాడుతూ.. ‘కెరీర్‌కు మంచి హెల్ఫ్ అయ్యే సినిమా అని కచ్చితంగా చెప్పగలం’ అని చెప్పారు.

చిత్ర దర్శకుడు నరేశ్ వర్మ మాట్లాడుతూ.. ‘ప్రారంభానికి ముందే ఈ సినిమా జనాల్లోకి వెళ్లిపోయింది. ఈ సినిమాను ఆదరించాలని అందరిని కోరుకుంటున్నా’ అని అన్నారు. చిత్ర సహ నిర్మాతలు ఆకుల రిషేంద్ర నరసయ్య బీసు చందర్ గౌడ్‌తోపాటు ఘర్షణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి డీవోపీ: వినోద్ కే సినగం; సంగీతం: అర్హమ్; ఎడిటర్: పవన్ శేఖర్.