calender_icon.png 25 March, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

నాటి జ్ఞాపకాలు నేటికీ పదిలం..

23-03-2025 09:03:43 PM

పూర్వ విద్యార్థుల కలయిక..

గురువులను సత్కరించిన విద్యార్థులు..

చర్ల (విజయక్రాంతి): మండల పరిధిలో గల శ్రీ సీతారామ ఉన్నత పాఠశాల సత్యనారాయణపురంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 1990-91 బ్యాచ్ కి చెందిన పదవ తరగతి విద్యార్థులు తమ స్నేహితులతో గడిపిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారికి చదువు నేర్పిన పాఠశాల గురువుల నుండి నేర్చుకున్న పాఠాలను గుణపాఠాలను మరో మారు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ గురువులను శాలువాలతో సత్కరించుకున్నారు. పాత స్నేహితులను కలిసిన ఆనందంలో సత్యనారాయణపురం గ్రామంలో సందడి కనిపించింది. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే పార్థసారథి, తెలుగు అధ్యాపకురాలు సుజాత, ఎల్ డి సి నరసింహా తదితర ఉపాధ్యాయని ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.