10-03-2025 12:10:41 AM
వెంకటేశ్వర స్వామి దేవస్థాన అధ్యక్షుడు మస్తానయ్య
హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): మానవసేవే మాధవ సేవగా భావించి సమాజ సేవకు ప్రాధాన్యమిచ్చిన కీర్తిశేషులు డోగిపర్తి సుబ్బారావు చిరస్మరణీయులని వెంకటేశ్వర స్వామి దేవస్థాన అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య అన్నారు. ఆదివారం గుంటూరులో డోగిపర్తి సుబ్బారావు 121వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన సేవా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు.
ఏటా చదువులో రాణిస్తున్న పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించడం హర్షినీయమన్నారు. సుబ్బారావు పరమపదించిన ఆయన ఆశయాలను సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళుతున్న కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు.
మరో అతిథి డాక్టర్ అతుకూరి వీర రాఘవరావు మాట్లాడుతూ.. యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థతో మాట్లాడి 20 మంది మహిళలకు కుట్టు మిషన్లు బహుకరించటం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో డోగిపర్తి సాంబశివరావు, డోగిపర్తి శివమోహన్ రావు, డోగిపర్తి సుబ్బారావు పాల్గొన్నారు