calender_icon.png 24 January, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిబ్రవరి 2న జరిగే సభను సక్సెస్ చేయాలి

24-01-2025 12:53:00 AM

* బీసీ రాజకీయ యుద్ధభేరిపై ఉమ్మడి వరంగల్ ముదిరాజ్ సన్నాహక సమావేశం

హనుమకొండ, జనవరి 23 (విజయక్రాంతి): వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో వచ్చేనెల 2న నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధ భేరి సభను విజయవంతం చేయాలని అర్బన్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి బయ్యస్వామి, పులి రజనీకాంత్ పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండలోని హంటర్ రోడ్‌లో యుద్ధభేరి సభకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ముదిరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, బీసీ నేత, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్‌లకు అన్యాయం జరుగుతుందన్నారు.

ఈ అన్యాయాన్ని ప్రశ్నించేందుకు నిరర్వహిస్తున్న యుద్ధభేరి సభకు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు. సమావేశానికి తమిళనాడు సీఎం స్టాలిన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తదతరులు హాజరుకాబోతున్నారు. తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు మాదం రజనీ కుమార్, ప్రొఫెసర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.