calender_icon.png 31 October, 2024 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంల సమావేశం శుభసూచకం

07-07-2024 01:37:56 AM

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు సమావేశం కావడం శుభసూచకమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల న్న పేర్కొన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా సోదరులుగా విభజన హామీ ల పరిష్కారం కోసం చర్చించడం గొప్ప విషయమని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ ప్రజలకు అర్థమైతోందని, ప్రజల ఆకాంక్షల మేరకు ఇరు రాష్ట్రా ల సీఎంలు మాట్లాడుతుంటే దీనిని రాజకీయంగా ఉపయోగించుకొని బురద జల్లాలని బీఆర్‌ఎస్ చూస్తోందని మండిపడ్డారు. కేసీఆర్, ఆయన పరివారానికి నిద్ర పట్టడం లేదని, జగన్, కేసీఆర్ పదేళ్ల స్వార్థ రాజకీయాలు తప్ప, సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయలేదని విమర్శించారు. రోజూ ఇంట్లో చేపల పు లుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని కేసీఆర్ అన్నాడని గుర్తుచేశారు. ఆయన పాలనలోనే 7 మండలాలు ఏపీలో కలిశాయని, హంతకులే సంతాపం తెలిపినట్టు ఉన్నదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తే బాగుంటుందని, ఇరు రాష్ట్రాల ము ఖ్యమంత్రుల సమావేశం వివాదం చేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.