మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికై తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు భేటీ ఓ ముందడుగు అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తే ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా అంగీకారం కుదురుతుందని ఆయన ఎక్స్ వేదికగా అభిలషించారు.