calender_icon.png 5 October, 2024 | 10:57 AM

వైద్యాధికారికి మూడేళ్ల కారాగార శిక్ష

05-10-2024 12:00:00 AM

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ఇద్దరు మహిళా వైద్యులను లైంగికంగా వేధించిన కేసులో ఓ అధికారికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. వివరాలిలా ఉన్నాయి.. 2017లో యాదాద్రి భువనగిరి జిల్లా వైద్యాధికారిగా పనిచేసిన డాక్టర్ దురిశెట్టి కాలిదాసాచారి (57) తన వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వైద్యాధి కారిణులపై లైంగిక వేధింపులకు పాల్పడి నట్టు భువనగిరి పట్టణ పోలీసులకు ఫిర్యా దు అందింది.

ఈ మహిళా వైద్యుల్లో ఒకరు షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొన్న డీఎంహెచ్‌వోపై భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, అత్యాచారనిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన భువనగిరి పట్టణ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయగా కేసును విచారించిన నల్లగొండ జిల్లా  ఎస్సీ, ఎస్టీ కోర్టు నింది తుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3 వేల జరిమాన విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది.