16-04-2025 01:59:19 AM
జిల్లా మేదరి సంఘం అధ్యక్షులు ప్రతాపగిరి శ్రీనివాస్
హనుమకొండ, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): పెళ్ళి పందిర్లు (తడికల, క్లాత్ డెకరేషన్) మేదరి కుల వృత్తి దారులు మాత్రమే వెయ్యాలి. అనే దానిపై చర్చించుకొనేదాని పై అత్యవసర సమావేశం కోరుట్ల రమేష్ అధ్యక్షతన సత్సంఘ్ కాంప్లెక్స్, హనుమకొండ నందు జరిగింది. అనంతరం మాట్లాడుతూ మేదరుల కుల వృత్తి అయినా తడుకల పందిర్లు, ఈవెంట్ మేనేజర్లు మాట్లాడుకోవడం వలన మేదరి కులవృత్తిదారులు చాలా నష్ట పోతున్నరన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మేదరి సంఘం అధ్యక్షులు ప్రతాపగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ అందరు ఐకమత్యంగా ఉండి మన కులవృత్తిని కాపాడాలన్నారు. బొమ్మిడి రమేష్ మాట్లాడుతూ ఈవెంట్ మేనేజర్లకి మన మేదరి వాళ్ళు పందిర్లు వేయద్దన్నారు. కూచనపల్లి మహేందర్ మాట్లాడుతూ అందరు ఒక్క కట్టు మీద ఈవెంట్ వారికి పని చేయకుండా మనం నేరుగా పని దొరికితేనే పని చేయాలనే నిర్ణయం మీద ఉండాలన్నాడు.
అనంతరం ఈవెంట్ మేనేజర్లకు పందిర్లు వేయవద్దని హాజరైన సభ్యులు తీర్మాణం చేశారు. ఈ సమావేశానికి తుమ్మల విజయ్, కూచనపల్లి దేవేందర్,శేర్ల దిలీప్, దండుగుడుం రమేష్, నీలం అంజి, వలిపిరెడ్డి రమేష్, బొమ్మిడి కుమార్, , మస్న రాజ్ కుమార్, తుమ్మల కుమార్ ఏకుల సంతోష్, బొమ్మిడి రమేష్, మస్నా రమేష్, కుమార్ సూరత్, తదితరులు పాల్గొన్నారు.