calender_icon.png 2 November, 2024 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పతకం చేజారింది

06-08-2024 03:10:45 AM

స్కీట్ షూటింగ్ కాంస్య పతక పోరులో భారత్ ఓటమి

పారిస్: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ షూటింగ్‌లో భారత్‌కు తృటిలో కాంస్యం చేజారింది. సోమవారం షూటింగ్ స్కీట్ మిక్స్‌డ్ టీమ్ విభాగం కాంస్య పతక పోరులో భారత్ 43 తేడాతో చైనా చేతిలో ఓటమి చవిచూసింది. భారత స్కీట్ షూటర్లు మహేశ్వరి చౌహాన్, అనంత్ జీత్ సింగ్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాంస్యం పతక పోరులో మహేశ్వరిేొఅనంత్ జీత్ 43 పాయింట్లు స్కోరు చేయగా.. చైనా జంట యితింగ్ జియాంగ్‌జియాన్లిన్ యూ 44 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది.  దీంతో భారత్‌కు షూటింగ్‌లో నాలుగో పతకం వచ్చినట్లే వచ్చి చేజారింది.

ఉదయం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో మహేశ్వరి జోడీ మూడు రౌండ్లు కలిపి 146 పాయింట్లు దక్కించుకొని నాలుగో స్థానంలో నిలిచింది. చైనా జోడీ (జియాంగ్, జియాన్లిన్) కూడా 146 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిది. మూడు రౌండ్లలో మహేశ్వరి వరుసగా 24, 25, 25 (మొత్తం 74 పాయింట్లు).. అనంత్ 25, 23, 24 (మొత్తం 72 పాయింట్లు) సాధించారు. ఇక భారత్‌కు ఈ ఒలింపిక్స్‌లో మూడు పతకాలు రాగా.. అన్నీ షూటింగ్‌లోనే వచ్చాయి. 10 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో  కాంస్యం నెగ్గిన మనూ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో సరబ్‌జోత్‌తో కలిసి రెండో పతకం సాధించింది. ఇక 50 మీ రైఫిల్ పొజిషన్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే.