వారంలోనే రంగు మారిన పతకంlఆధారాలతో పోస్ట్ చేసిన అథ్లెట్
పారిస్: ఒలింపిక్ పతకం అనేది అనేక మంది కల. ఈ పతకం కోసం అనేక మంది అనేక రకాల త్యాగాలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. కానీ నిద్రాహారాలు మాని సాధించిన ఒలింపిక్ పతకం రంగు పోతే ఆ క్రీడాకారులకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. సరిగ్గా అటువంటి ఘటనే అమెరికాకు చెందిన ఓ అథ్లెట్‌కు ఎదురైంది. గత వారం జరిగిన స్టేటింగ్ పోటీల్లో కాంస్య పతకం గెలుచుకున్న అమెరికన్ అథ్లెట్ నిజా హ్యూస్టన్ విషయంలో ఇదే జరిగింది.
‘వారం రోజులకే నాకు ఇచ్చిన పతకం రంగు పోయింది. పతకాలు అనుకున్నంత నాణ్యతగా లేవు. కాస్త గరుకుగా మారిపోయింది. ఈ పతకాన్ని చూస్తే ఏదో యుద్ధానికి వెళ్లి వచ్చినట్లు అనిపిస్తోంది’ అని పేర్కొంటూ హ్యూస్టన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే కాకుండా రంగు మారిన పతకం ఫొటోను కూడా పంచుకున్నాడు. దీనిపై పారిస్ ఒలింపిక్ కమిటీ సభ్యుడు స్పందిస్తూ.. దీనిపై చర్యలు చేపట్టామని, పాడయిపోయిన పతకాల స్థానంలో కొత్త పతకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.