calender_icon.png 9 January, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూకట్ పల్లి, మూసాపేట జంట సర్కిళ్లలలో పర్యటించిన మేయర్..

08-01-2025 04:26:28 PM

మౌలిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తాం... మేయర్ గద్వాల విజయలక్ష్మి

కూకట్ పల్లి (విజయక్రాంతి): కూకట్ పల్లి, మూసాపేట జంట సర్కిళ్ల పరిధిలోని పలు డివిజన్ లలో జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాలానగర్ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారి నుండి పాదయాత్రగా వినాయక నగర్, నవజీవన నగర్, రాజీవ్ గాంధీ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అభివృద్ధి పనుల విషయంలో అధికారులు అలస్వత్వం వీడి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

అదేవిధంగా అల్లాపూర్ డివిజన్ లోని సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ పర్యటిస్తూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల నుండి సమస్యలను తెలుసుకున్నారు. అల్లాపూర్ డివిజన్ సప్ధర్ నగర్ ఇ బ్లాకులో డ్రైనేజీ, మంచినీటి సరఫరా,సిసి రోడ్లు, వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని డివిజన్ కార్పొరేటర్ మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. రాజీవ్ గాంధీ నగర్ లో సి బ్లాక్ వరకు భూగర్భ డ్రైనేజీ పనులు చేయాలన్నారు. సర్వేనెంబర్ 18లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నుండి కుబాబు మజీద్ వరకు స్టామ్ వాటర్ డ్రైన్ నిర్మించకపోవడం తో వర్షాకాలంలో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ అభివృద్ధి పనులకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్, కార్పొరేటర్ లు రవీందర్ రెడ్డి, సబిహా గౌసిద్దీన్ అన్ని శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.