హౌసింగ్ సభ స్థలాన్ని సంధర్శించి ఏర్పాటు తనిఖీ చేసిన మేయర్ యాదగిరి సునీల్ రావు...
సభ ఏర్పాట్లపై అధికారులకు సూచనలతో కూడిన ఆదేశాలు..
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రుల కరీంనగర్ నగర పర్యటన ఏర్పాట్లను మేయర్ యాదగిరి సునీల్ రావు పరిశీలించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ ప్రాజెక్టులో అభివృద్ధి చేసిన మల్టిపర్పస్ పార్కు, 24 గంటల వాటర్ సప్లై, ఈ క్లాస్ రూమ్స్, స్పోర్ట్స్ కమర్షియల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవాలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ రానున్నారు. అభివృద్ధి చేసిన ప్రాజెక్టులన ప్రారంభించి హౌజింగ్ బోర్డులో సభలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో మేయర్ యాదగిరి సునీల్ రావు హౌజింగ్ బోర్డులో సభ స్థలాన్ని సంధర్శించి... ఏర్పాట్లను తనిఖీ చేసి పరిశీలించారు. సభ కోసం ఏర్పాటు చేస్తున్న స్టేజ్, భరికేడింగ్, సీటింగ్ అరేంజ్ మెట్లను పరిశీలించి అధికారులకు సలహాలతో కూడిన ఆదేశాలు జారీ చేశారు. సభ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు వాలా రమణ రావు, తుల రాజేశ్వరి బాలయ్య అధికారులు పాల్గొన్నారు.