calender_icon.png 16 January, 2025 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మ్యాచ్ గెలవాల్సిందే

07-08-2024 04:02:13 AM

  1. నేడు భారత్, శ్రీలంక చివరి వన్డే
  2. ఒత్తిడిలో రోహిత్ సేన

కొలంబో: టీ20 సిరీస్ నెగ్గి ఆనందంలో ఉన్న టీమిండియాకు వన్డే సిరీస్‌లో ఊహించని షాక్ ఎదురైంది. తొలి మ్యాచ్ టై కావడం.. రెండో వన్డేలో పరాజయం సిరీస్‌లో భారత్‌ను వెనుకబడేలా చేసింది. ఇక 1 సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచిన లంక వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఈ నేపథ్యంలో నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్డేకు సిద్ధమైంది. నేటి మ్యాచ్ ఓడితే మాత్రం 27 ఏళ్ల తర్వాత శ్రీలంకకు సిరీస్ కోల్పోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి రాకూడదంటే ఇవాళ్టి మ్యాచ్‌లో టీమిండియా గెలుపు తప్పనిసరి. కొలంబో వేదికగానే జరగనున్న మూడో వన్డేకు స్పిన్నర్లు మరోసారి కీలకం కానున్నారు. రెండో వన్డేలో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన వండర్ సే నుంచి ముప్పు పొంచి ఉంది.

బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మినహా మిగిలినవారిలో నిలకడ లోపించింది. గత మ్యాచ్‌లో గిల్, రాహుల్, అక్షర్‌లు పర్వాలేదనిపించగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాణించాల్సిన అవసరముంది. బ్యాటింగ్‌లో ఎప్పుడు బలంగా కనిపించే టీమిండియా లంకతో సిరీస్‌లో మాత్రం పూర్తి స్థాయిలో నిరాశపరుస్తోంది. మరోవైపు టీ20 సిరీస్ కోల్పోయినప్పటికీ చివరి టీ20 నుంచి లంక ఆటతీరు పూర్తిగా మారిపోయింది. తొలి వన్డే టై చేసుకోవడం.. రెండో వన్డేలో సమిష్టి ప్రదర్శన జట్టుకు విజయం కట్టబెట్టింది. చివరి వన్డేలో గెలిచి సిరీస్‌ను చేజెక్కించుకోవాలని చూస్తోంది. ఇక టీమిండియా 1997లో చివరిసారి లంకకు వన్డే సిరీస్‌ను కోల్పోయింది.