calender_icon.png 29 December, 2024 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక అధికారం కోసం బహుజనులు ఏకం కావాలి

28-10-2024 01:35:11 AM

బీసీ లెక్చరర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కాముని సుదర్శన్

కామారెడ్డి,అక్టోబర్27(విజయక్రాంతి): బహుజనులకు సామాజిక అధికారం రావాలంటే  బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఏకం కావాలని బీసీ లెక్చరర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కాముని సుదర్శన్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కోసం ఏర్పాటు చేసిన సామాజిక అవగాహన శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పార్టీల నాయకులు ఓటు బ్యాంక్‌గా చూస్తున్నంత కాలం బహుజనులకు అధికారం రాదన్నారు. బహుజనులు అందరూ ఏకతాటిపైకి వస్తేనే రాజ్యాధికారం చేతికొస్తుందన్నారు. అప్పుడే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు. రాజకీయ పార్టీలు మనలో మనకు విబేధాలు సృష్టిస్తున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి బీసీ సంఘం అధ్యక్షుడు సాపశివరాములు, అంబేడ్కర్ సం ఘం ప్రతినిధులు, మైనార్టీ ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు