- వృద్ధ దంపతుల స్థలం ఆక్రమణ
విదేశాలకు వెళ్లొచ్చేసరికి దేవుని పేరుతో కాలనీ వాసుల
అత్యుత్సాహంప్రైవేట్ స్థలంలో గుడి కట్టిన ఆక్రమణదారులు
ప్రభుత్వమే న్యాయం చేయాలంటూ వేడుకుంటున్న వృద్ధ దంపతులు
మేడిపల్లి, జనవరి 24: భూ అక్రమణదారులు భరితెగించారు. వృద్ద దంపతులు విదేశాలకు వెళ్లి వచ్చే సరికి వారి స్థలం కబ్జాచేశారు. దేవుడు వెలిశాడని నమ్మబలికి, కాలనీ వాసుల అండతో గుడి కట్టారు. అయ్యో తమ స్థలం కబ్జా చేశారు న్యాయం చేయండని ఇప్పుడు ఆ వృద్ద దంపతులు ఆ దేవుడిని వేడుకుంటున్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన పై కథనం వారి మాటల్లోనే.. నా పేరు శోభ, నా భర్త పేరు ధనుంజయ బాయ్.
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల రెవెన్యూ సర్వే నెంబరు 76/6,76/7,76/8 లో 1978 లో భూ పట్టా దారులు లే అవుట్ చేశారు. ఇందులో ప్లాట్ నెంబరు 108 శోభ,109 ధనుంజయ బాయ్ పేర కొనుగోలు చేశాము. పిల్లలు విదేశాలలో ఉంటుండంతో అక్కడే పిల్లలతో కలిసి ఉంటున్నాము. ఇటీవల స్వదేశానికి వచ్చిన సందర్భంలో తమ ఇంటి స్థలాల వద్దకు వెళ్లి చూశాము.
అయితే ఈ స్థలంలో తాత్కాలిక షెడ్ వేసి ఉండడం చూసి ఇరుగు, పొరుగు వారిని అడగ్గా కాలనీకి చెందిన స్థలమని మీరు ఇక్కడ నుండి వెళ్ళి పోవాలని లేనిపక్షంలో మీ అంతు చూస్తామని కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారు. మేము మా పిల్లల భవిష్యత్ కోసం పైస పైస కూడబెట్టి ఈ స్థలం కొనుగోలు చేశాము. ఇప్పుడు కొందరు తమ స్థలాన్ని ఆక్రమించి, అంతుచూస్తామని బెదిరింపులకు దిగుతున్నారు.
ప్రభుత్వం, పోలీసులు జోక్యం చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలి. పట్టదారుల వారసులైన కొత్త నవీన్ యాదవ్ కూడా అతనికే ఏజీపీఏ చేశామని ధ్రువీకరణ చేశారు. అయినా వాళ్ళు మమ్ములను బెదిరిస్తున్నారు. చేసేదేమీ లేక మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయం పై స్పష్టత ఇవ్వడం లేదు. మరి ప్రభుత్వం స్పందించి ఆ వృద్ద దంపతులకు న్యాయం చేస్తారా లేదా వేచి చూడాలి మరి.