ఒలింపిక్స్ పేరు వినగానే ఐదు రింగుల చిహ్నంతో పాటు మస్కట్ కూడా గుర్తుకురావడం ఖాయం. ప్రతీ విశ్వక్రీడల్లో ముద్దొచ్చే మస్కట్‌ను రూపొందించడం ఆనవా యితీగా వస్తోంది. ఈసారి క్రీడలకు పారిస్ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యం లో ‘ఫ్రీజీ’ అనే మస్కట్‌ను రూపొందించారు. ఈ మస్కట్‌లో ఫ్రాన్స్ జాతీయ పతాకంలోని ఎరుపు, నీలం, తెలుపు రంగులు కనిపిస్తాయి. పెద్ద పెద్ద నీలి కళ్లతో ఫ్రాన్స్ జాతీయ జెండాలోని మూడు రంగుల కలయికలో ‘ఫ్రీజీ’ మస్కట్ ఆటల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫ్రాన్స్ దేశ స్వేచ్ఛకు ఈ టోపీని సంకేతంగా భావిస్తారు.