04-03-2025 12:45:58 AM
బైంసా, మార్చి 3 ః కుబీర్ మండలంలోని పార్టీ బి గ్రామంలో రాజరాజేశ్వర ఆలయంలో సోమవారం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉత్సవాల ఊరేగింపు నిర్వహించి కళ్యాణోత్సవం నిర్వహించగా ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహాశివరాత్రి పండుగలు పురస్కృతిని ఐదు రోజులపాటు ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తారు.