calender_icon.png 16 April, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్ తరలిస్తే సహించేది లేదు

14-04-2025 07:22:27 PM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జూబ్లీ మార్కెట్ తరలిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జూబ్లీ మార్కెట్ ను డిపిఓ బిక్షపతి గౌడ్ తో కలిసి సందర్శించారు. కూరగాయల మార్కెట్ లో పారిశుద్ధ పనులు చేపట్టకపోవడంతో దుర్వాసన వస్తుందని అక్కడ వ్యాపారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. జూబ్లీ మార్కెట్లో కూరగాయలు, చికెన్, మటన్, చేపలు అమలసి ఉండగా పట్టణంలో పలుచోట్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఎదుట వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఆసిఫాబాద్ పట్టణంలో వేరే చోట కూరగాయలు ,మాంసాహార దుకాణాలు పెట్టవద్దని జూబ్లీ మార్కెట్లోనే విక్రయించేల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కోట్ల రూపాయలు వెచ్చించి మార్కెట్ ఏర్పాటు చేస్తే దాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాజంపేట గ్రామపంచాయతీ, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో వ్యాపారాలు అన్ని ఒకే చోట కొనసాగించాలన్నారు. పంచాయతీ ,మున్సిపాలిటీ వేరువేరుగా వ్యవహారాలు చేపట్టి ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు కలిగించే పనులు చేస్తే ధర్నాకు దిగుతామని స్పష్టం చేశారు. ప్రజల సౌలభ్యం కోసం మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తే వారికి ఇబ్బందులు కలిగేలా అధికారులు చర్యలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ ,రాజంపేట లో విధులు నిర్వహించే అధికారులు సంయుక్తంగా పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.