calender_icon.png 16 November, 2024 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరో రోజూ మార్కెట్ డౌన్

15-11-2024 12:00:00 AM

ముంబై, నవంబర్ 14:  భారత్ స్టాక్ మార్కెట్‌ను బేర్స్ స్వాధీనంలోకి తీసుకోవడంతో వరుసగా ఆరో రోజూ స్టాక్ మార్కెట్ క్షీణించింది.  విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు వేగవంతంకావడంతో  గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్ మరో 110 పాయింట్లు క్షీణించి 77,580 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26 పాయింట్ల తగ్గుదలతో కీలకమైన 23,532 పాయింట్ల వద్ద  ముగిసింది.

సెన్సెక్స్ బాస్కెట్‌లో హిందుస్థాన్ యూనీలీవర్, ఎన్టీపీసీఎ, నెస్లే, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టాటా మోటా ర్స్, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు 2 శాతం వరకూ తగ్గాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు స్వల్పంగా లాభపడ్డాయి. 

నేడు మార్కెట్లకు సెలవు

గురునానక్ జయంతి సందర్భంగా శుక్రవారం నవంబర్ 15న స్టాక్ ఎక్సేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు.