calender_icon.png 9 January, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి గమ్మత్తు!

09-01-2025 12:21:07 AM

  1. ఆసిఫాబాద్ జిల్లాలో జోరుగా విక్రయం
  2. బానిసలవుతున్న యువత 

కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ ఏజెన్నీ ప్రాంతంలో యువతతో పాటు పెద్దలు గంజాయికి అలవాటు పడుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడటంతో యువత గంజాయి, మద్యం, సిగరెట్ వంటి వ్యవసనాలకు బానిసలవుతున్నారు. స్నేహితుల ప్రోత్సాహంతో దురల  ఆకర్షితులవుతున్నారు.

ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలను అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు పట్టించు  లేదన్న ఆరోపణలున్నాయి. పోలీసులు గంజాయి సాగు, రవాణాపై దృష్టి సారిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో నివారించడంలో విఫలం అవుతున్నారు. 

పెరిగిన గంజాయి కేసులు

గంజాయి తరలిస్తున్న, సాగు చేస్తున్న వారిపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది 129.41 శాతం గంజాయి కేసులు పెరిగినట్లు పోలీసులు వెల్లడించిన వార్షిక క్రైం రిపోర్టులో ఉంది. 39 గంజాయి కేసుల్లో 65 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 298.855 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 121 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. అక్టోబర్ 31న వాంకిడి చెక్ పోస్ట్ వద్ద లారీలో తరలిస్తున్న 281.7 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దాని విలువ రూ.70.42 లక్షలు ఉంటుంది. 

పిల్లల నడవడికను గమనించాలి

తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఒకసారి గంజాయికి అలవాటు పడిన వ్యక్తిని సాధారణ స్థితికి తీసుకురావడం చాలా కష్టమని వైద్య నిపుణులు చెపుతున్నారు. గంజాయికి అలవాటు పడిన వారి నిద్ర, ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తుంటాయి. అతిగా నిద్రపోవడం లేదా రాత్రంతా మెలకువతో ఉండటం చేస్తారు. పిల్లల ప్రవర్తనలో మార్పులను ఎప్పటికప్పడు గమని  గంజాయిని అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. 

గంజాయిపై ఉక్కుపాదం 

గంజాయి రవాణ, సాగుపై ప్రత్యేక నిఘా పెంచాం. గ్రామీణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ఏరియాల్లో గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమలు ఏర్పాటు చేస్తున్నాం. గతంలో పోలిస్తే ఈ ఏడాది గంజాయి కేసుల శాతం పెరిగింది. నిఘా పెంచడంతోనే గంజాయి కేసులు పెరుగు  ఎంతో భవిష్యత్తు ఉన్న యువత  వ్యసనాల బారిన పడి జీవితాన్ని వృథా చేసుకోవద్దు.

 డీవీ శ్రీనివాస్‌రావు, జిల్లా పోలీస్ అధికారి, ఆసిఫాబాద్