calender_icon.png 16 March, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్బుల్ లుక్ అదిరింది

16-03-2025 12:35:12 AM

ఇంట్లో ఫ్లోరింగ్‌కు, వంటింట్లో గోడకు మార్బుల్ టైల్స్ వేస్తుంటారు. అందుకు అందుకు పాలరాతిని వాడుతారు. అయితే లేలేత రంగుల్లో సన్నని వలయాల్లాంటి గీతలతో కనిపించే ఆ పాలరాతి సౌందర్యం.. ఫ్యాషన్ రంగానికీ బాగా నచ్చినట్లుంది. ఇప్పుడు ఏకంగా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్‌లోనూ మార్బుల్ ప్రింట్లను ముద్రించేస్తున్నారు.

దాంతో వాటిని సైతం అమ్మాయిలు ఎంతో ఇష్టంగా చుడీదార్లు, కుర్తీలు కుట్టించుకుని వేసేసుకుంటున్నారు. అలాగే బ్యాగులు, చెప్పుల్లాంటి యాక్సెసరీల్లోనూ మార్బుల్ ప్రింట్ అందంగా కనువిందు చేస్తూ పదిమందినీ మెప్పించేస్తోంది. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండిమరి.