శ్రీధర్ బాబును సత్కారంలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్...
మంథని (విజయక్రాంతి): మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)తోనే మంథని ప్రాంతం అభివృద్ధి చేందుతుందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్(Single Window Chairman Kota Srinivas) అన్నారు. మంగళవారం మంథని మున్సిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణం, పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు సింగిల్ విండో చైర్మన్ ముందుగా పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి శ్రీధర్ బాబు మంథని ప్రాంతానికి ఎనలేని నిధులు తీసుకువస్తున్నారని కోనియాడారు. రాబోయే రోజుల్లో మంథని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.