09-04-2025 01:28:36 AM
అకాల గాలి వర్షంతో మామిడి తోటలకు భారీగా నష్టం
నేల రాలిన మామిడి కాయలు
లబోదిబొమంటున్న రైతులు
ఖమ్మం , ఏప్రిల్ 8 ( విజయక్రాంతి ):-ఆకాల గాలి వర్షం మామిడి రైతులను పెద్ద ఎత్తున నష్ట పరిచింది. తాజాగా వీచిన పెను గాలులు, అకాల వర్షానికి సత్తుపల్లి నియోజకవర్గం లో మామిడి తోటలు దెబ్బతిన్నట్లు రైతులు గగ్గోలు పెడుతున్నారు . ఈ ఏడాది పూత, కాపు మంచి ఆశా జానకంగా ఉందని రైతులు సంతోషిస్తున్న తరుణం లో తాజాగా కురిసిన గాలి వా టానికి, అకాల వర్షానికి మామిడి చెట్లు నుంచి కాయలు పెద్ద ఎత్తున రాలి కిందపద్దాయి.
మామిడి పిందెలు నేలపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీ రవుతున్నారు. సత్తుపల్లి, వేంసూ రు, కల్లూరు, పెనుబల్లి మండలాల్లో వేలాది మామిడి చెట్లు గాలి వాటానికి దెబ్బతినడంతో భారీ ఎత్తున నష్టపోయినట్లు తెలు స్తోంది. ఎక్కువుగా సత్తుపల్లి, వేంసూరు ప్రాంతాల్లో మామిడి రైతులు నష్ట పోయినట్లు తెలిసింది. అకాల గాలి వర్షానికి మా మిడి కాయలు నేలపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలే పోయిన ఏడాది బాగా నష్టపోయిన తమకు ఈసారి కూడా నష్టాలు తప్పేటట్లు లేవని ఆందోళన చెందుతున్నారు. నేలపాలైన మామిడి కాయలు చూసుకొని రైతులు కన్నీళ్ళ పర్యoతమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి, సర్వే చేసి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. నియోజకవర్గంలో వీచిన గాలి, వర్షం కారణంగా సత్తుపల్లి, వెంసూర్,పెనుబల్లి, కల్లూరు,తల్లాడ మండలాలలో నిమా మిడి తోటల్లో కాయలు రాలిపోయినట్లు రైతులు తెలిపారు.
క్షేత్ర స్థాయి లో పరిశీలన చేసిన ఉద్యాన శాఖ అధికారులు వెంసూర్ మండలం లో మామిడి కాయలురాలినట్లు గుర్తించి మామిడి రైతుల పేర్లు నమోదు చేసుకున్నట్లు ఉద్యనా శాఖ అధికారి శ్రావణి తెలిపారు.అలాగే పెనుబల్లి కల్లూరు, తల్లాడ గాలి వాన పెద్ద గా నమోదు కాలేదని మామి డి కీ కూడా నష్టం ఎక్కువ గా లేదని కల్లూరు ఉద్యాన శాఖ అధికారి జి.నగేష్ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని తెలిపారు.
రూపాయి ,రూపాయి అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి అంతా గాలి దుమారానికి నేల పాలయింది. పంట చేతికి వచ్చింది కదా కోసి మార్కెట్ కి తరలించి అప్పులు తీరుద్దామనుకుంటున్న సమయంలో వచ్చిన గాలి దుమారానికి టన్నుల కొద్ది మామిడికాయలు నే లపాలయ్యాయి.సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లికి చెందిన ధారావత్ కృష్ణ అనే రైతు సుమారు 30 ఎకరాల మామిడి తోటలను లీజుకు తీసుకుని, అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాడు.
దిగుబడి బాగా రావటంతో తెచ్చిన అప్పులు పోను రూపాయి మిగులుతుంది అనుకున్నాడు మరో రెండు రోజులలో కాయలు కోయటానికి సిద్ధమవుతుండగా, ప్రకృతి పగబట్టింది.సుమారు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు మామి డికాయలు టన్నుల సంఖ్యలో రాలి కింద పడిపోయాయి. అకాల వర్షానికి సుమారు రూ. 15 లక్షల నష్టం వాటిలినట్లు కృష్ణ తెలిపాడు. అకాల వర్షం తన నోట్లో మట్టి కొ ట్టిందని.
ఈసారైనా అప్పులు తీరతాయనుకున్నానని, కానీ తన ఆశలన్నీ అడియాశలు అయ్యాయని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.తక్షణమే వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించి, రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
కాగా క్షేత్ర స్థాయి లో పరిశీలన చేసిన ఉద్యాన శాఖ అధికారులు వెంసూర్ మం డలం లో మామిడి కాయలురాలినట్లు గు ర్తించి మామిడి రైతుల పేర్లు నమోదు చేసుకున్నట్లు ఉద్యనా శాఖ అధికారి శ్రావణి తెలిపారు.అలాగే పెనుబల్లి కల్లూరు, తల్లాడ గాలి వాన పెద్ద గా నమోదు కాలేదని మామిడి కీ కూడా నష్టం ఎక్కువ గా లేదని కల్లూరు ఉద్యాన శాఖ అధికారి జి.నగేష్ తెలిపారు.వివిధ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని తెలిపారు.