calender_icon.png 22 January, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ సభల నిర్వహణలో పారదర్శకంగా నిర్వహించాలి

22-01-2025 02:09:55 AM

జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

గద్వాల, జనవరి 21 ( విజయక్రాంతి ) : ప్రజాపాలన గ్రామ సభల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని, ప్రతి దశను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో  రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభ నిర్వహణను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామసభల్లో  సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి, లబ్ధిదారుల ప్రాథమిక జాబితాను చదివి అర్హులను మాత్రమే ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్ల పథకాల పథకాల అమలుకు సంబంధించిన అన్ని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించి అవి సక్రమంగా నిర్వహించబడుతున్నాయో లేదో తనిఖీ చేశారు.

ప్రతి రిజిస్టర్లో వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని, ఎటువంటి లోపాలు లేకుండా సమాచారం పూర్తి స్పష్టంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సభల్లో తీసుకున్న అభ్యంతరాలు, సర్వేలో మిస్ అయిన వారి దరఖాస్తులను స్వీకరించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

గ్రామ సభ  ప్రక్రియలో ఎలాంటి లోపం లేకుండా అన్ని వివరాలను సక్రమంగా డేటా ఎంట్రీ  చేయాలని  అధికారులకు ఆదేశించారు.  అదనపు కలెక్టర్ నర్సింగ రావు,ఎంపీడీఓ జుబేర్ మోహినుద్దీన్,ఎ.ఈ.ఓ, పంచాయితీ సెక్రటరీ పాల్గొన్నారు.