calender_icon.png 13 December, 2024 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్‌కాల్వలో దూకిన వ్యక్తి

13-12-2024 12:08:38 AM

* ముమ్మరంగా గాలింపు చర్యలు

నల్లగొండ, డిసెంబర్ 12 (విజయక్రాంతి): సాగర్ కాల్వలోకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, గల్లంతైన ఘటన వేములపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం బొల్లికుంట తండాకు చెందిన లావూరి శివ (24) ఆటోలో వేములపల్లి వరకు వచ్చాడు. నడుచుకుంటూ వెళ్లి సాగర్ కాల్వలో దూకాడు. గమనించిన ఓ ఆటోడ్రైవర్ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. శివ కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనా స్థలం వద్దకు వచ్చి గాలింపు చర్యలను ము మ్మరం చేశారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో శివ కాల్వలో దూకినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.