calender_icon.png 20 March, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పామును కాటేసిన మనిషి

06-07-2024 12:36:20 AM

తనను కరిచిందన్న కోపంతో కొరికి చంపేశాడు

బీహార్‌లో ఘటన

పాట్నా, జూలై 5 : బీహార్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తనను కరిచిన పామును కొరికి అవతల పారేశాడు. నోట కరుచుకొని కసితీరా కొరికి ప్రాణాలు తీశాడు. నవాడా జిల్లా రాజౌలికి చెందిన సంతోష్ లాహోర్ (35) అనే వ్యక్తి స్థానిక రైల్వే స్టేషన్‌లో పని చేస్తున్నాడు. చాలా రోజుల త ర్వాత కాస్త విశ్రాంతి తీసుకుందామని బేస్ క్యా ంప్‌లో నిద్రపోయాడు. ఆ సమయంలోనే పాము కాటు వేసింది. వెంటనే ఆ పాముని ప ట్టుకుని కసితీరా కొరికేశాడు.

రెండు సార్లు బలంగా కొరకడం వల్ల ఆ పాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాము కాటు వేసినప్పుడు విషం ఎక్కకూడదంటే దాన్ని కొరికి చంపాలని చాలా మంది నమ్ముతుంటారు. కానీ ఇది మూఢనమ్మకమ ని వైద్యులు కొట్టి పారేశారు. పాము చనిపోగా బాధితుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సిబ్బంది గుర్తించి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్ ఫతేపూర్‌కి చెందిన ఓ వ్యక్తి రెండు నెలల వ్యవధిలోనే ఐదు సార్లు పాము కాటుకు గురయ్యాడు. అన్ని సార్లు కాటు వేసినా బతికి బట్టకట్టడం చూసి వైద్యులే ఆశ్యర్యపోయారు. 

డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలు..

పాము కాటుకు గురైనప్పుడు ఎలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకుండా వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలని డబ్ల్యూహె చ్‌వో పేర్కొంది. అత్యవసర వైద్యం ద్వారా ప్రాణాలు నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. బిగుతుగా ఉండే దుస్తులు విప్పేయాలని సూచించిం