ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో మర్డర్
రాజేంద్రనగర్ (విజయక్రాంతి): ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టేపల్లికి చెందిన మహమ్మద్ సైఫ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల కారణంగా మృతుడు సైఫ్ ను తన బావ ఇస్మాయిల్ రాయితో మోది కిరాతకంగా హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ ఏసిపి శ్రీనివాస్ వివరాలు సేకరించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నా పోలీసులు.